కరీంనగర్, 9 September
కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఘటనలో, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ నుండి అర్థరాత్రి పెట్రోలింగ్ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. రాత్రంతా వాహనంలో తిరిగిన దొంగలు, తెల్లవారుజామున వరంగల్ వెళ్తుండగా ఎల్కతుర్తి వద్ద ప్రమాదానికి గురిచేశారు.
జిల్లాలో పోలీస్ వాహనం చోరీ* పోలీస్ స్టేషన్ నుండే ఎత్తుకెళ్లిన దొంగ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచిన పెట్రోలింగ్ వాహనాన్ని అర్థరాత్రి ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి రాత్రంతా ఆ వాహనంలోనే షికారు ఇవాళ తెల్లవారుజామున వరంగల్ వెళ్తుండగా.. ఎల్కతుర్తి వద్ద వాహనం ప్రమాదానికి గురైనట్టు తెలుసుకుని వెంటనే అక్కడికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

