మీడియా (ధర్మ రథం) సెప్టెంబర్ 02
తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్, అధినేత కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బుధవారం ఎల్లారెడ్డిపేట మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ మజీద్ ఆధ్వర్యంలో ఈ ఫిర్యాదు అందింది.
తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ చీఫ్, అధినేత కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ మజీద్ ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మజీద్, మహిళా నాయకులు కదిరే రేణుక, ఆకారం పుష్పలత మల్లవ్వ, యువ నాయకుడు జావిద్ మాట్లాడుతూ, సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కవిత రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పాంచజన్య సంకల్ప సభ విజయవంతం కావడంతో, సభకు వచ్చిన అశేష జనసందోహాన్ని చూసి రాజకీయ నాయకులు, వారికి వత్తాసు పలుకుతున్న కొంతమంది ఉద్యోగులు జీర్ణించుకోలేక ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, తదితర సోషల్ మీడియా వేదికల్లో కవితను ఉద్దేశించి అభ్యంతరకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలను ప్రచురించి ప్రచారం చేయడం హేయమైన చర్య అని అన్నారు.
మహిళా నాయకురాలి గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగి అయిన పోలీస్ కానిస్టేబుల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.










