నడిగూడెం, 2026-11-20
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన అమరజీవి, గీత కార్మిక సంఘం నాయకులు కీర్తిశేషులు కుక్కడపు పున్నయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారులు వీరభద్రం, పరశురాం, వీరబాబు గ్రామంలో 12 బల్లాలు ప్రధాన కూడళ్లలో 50 వేల విలువైన బల్లాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బల్లాలు దాతలను గ్రామ సర్పంచ్ బూత్కూరు వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ వీరాంజనేయులు, సింగిల్ విండో డైరెక్టర్ చిన్నకోటిరెడ్డి, ఆదర్శ రైతు నరసింహారావు, రైతు నేత శ్రీనివాస్ రెడ్డి, గంధం కోటయ్య, తోడేటి వెంకటేశ్వర్లు, శ్రీరాములు వెంకన్న తదితరులు అభినందించారు. కీర్తిశేషులు కుక్కడపు పున్నయ్య జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు చేసిన ఈ సేవను పలువురు ప్రశంసించారు.


