జగిత్యాల, 2026-11-20
మెట్పల్లిలో నూతన చేయూత పెన్షన్ మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం రాజకీయ నినాదాలతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పెన్షన్ పత్రాల పంపిణీ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ప్రాంగణం హోరెత్తింది.
మెట్పల్లిలో నూతన చేయూత పెన్షన్ మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం రాజకీయ నినాదాలతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కార్యక్రమ ప్రాంగణం హోరెత్తింది.
ఒకవైపు జై బీఆర్ఎస్.. మరోవైపు జై కాంగ్రెస్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరు పార్టీల కార్యకర్తల నినాదాలతో పరిస్థితిని గమనించిన పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ క్రమంలో మంత్రి స్వయంగా జోక్యం చేసుకుని కాంగ్రెస్ కార్యకర్తలకు సర్దిచెప్పారు. మంత్రి జోక్యంతో కార్యకర్తలు శాంతించడంతో ఉద్రిక్తతకు తెరపడింది.
అనంతరం మంత్రి వేదికపైకి చేరుకోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమం రాజకీయ నినాదాలతో కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసి, మంత్రి జోక్యంతో సద్దుమణిగింది.



