Nalgonda/Nalgonda (ధర్మ రథం) జూలై 31
మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పార్థీవ దేహానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు, మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థీవ దేహానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు, మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించిన కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డిలు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా సుదర్శన్ రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించి, ఆయన కుటుంబానికి తమ మద్దతు తెలిపారు.












