ముస్తాబాద్, 2026-11-22
మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా దంపతులు, వివాహానికి పుస్తె మట్టెలు అందించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి, వెంకటేశ్వర రావు దంపతులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. చిప్పలపల్లి గ్రామానికి చెందిన సుద్దాల జ్యోతి, హనుమయ్యల రెండవ కుమార్తె తన్విక వివాహం రేపు జరగనున్న నేపథ్యంలో, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమ్మటి రాజమల్లు విజ్ఞప్తి మేరకు ఈ దంపతులు పుస్తె మట్టెలు అందించారు.
ఈ సందర్భంగా సుద్దాల జ్యోతి, హనుమయ్య దంపతులు చిట్నేని మాధవి, వెంకటేశ్వర రావు దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాడిచర్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ రామచంద్రము, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ కొమ్మటి రాజమల్లు, డైరెక్టర్ సుద్దాల రాజయ్య, కొమ్మటి శ్రీనివాస్, పారిపెల్లి కాశయ్య తదితరులు పాల్గొన్నారు.



