రాజన్న సిరిసిల్ల, 2026-08-23
రాజన్న సరసల్ల జల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ శ్రీగ్రామంలోన ఆలయంలో ్రీ సీతారామ చంద్ర స్ామ ార భ్తులు సుమారు రామచంద్ర ల్షల రూపాయల లుైన ెండ ానులను సమర్పంచారు. బాలయ్య గార తన్నీరు భారతీ - రాజ్రరాు దంపతుల ుమారుడు ప్రసాద్ రాు, సరత దంపతులు ఈ ానులను అందజారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని శివకేశవ ఆలయంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారికి భక్తులు సుమారు 5 లక్షల రూపాయల విలువైన వెండి కానుకలను సమర్పించారు. బాలయ్య గారి తన్నీరు భారతీ - రాజేశ్వరరావు దంపతుల కుమారుడు ప్రసాద్ రావు, సరిత దంపతులు సుమారు 2 కేజీల వెండి తీర్థ పాత్రలు, మంగళహారతి సెట్‌ను ఆలయ అర్చకులకు అందజేశారు.
దాతలకు సర్పంచ్ కృతజ్ఞతలు
ఈ సందర్భంగా పోతుగల్ గ్రామ సర్పంచ్ యాదమ్మ - శ్రీనివాస్ దంపతులు దాతల ఉదారతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారికి భక్తిశ్రద్ధలతో కానుకలు సమర్పించిన దాతల కుటుంబానికి శ్రీ సీతారామచంద్ర స్వామివారి మరియు ఆంజనేయ స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. వారి కుటుంబం ఆయురారోగ్యాలతో, సకల ఐశ్వర్యాలతో ఉన్నత స్థానాల్లో వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థించారు.
భక్తుల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. దాతలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.








