రాజేంద్రనగర్ (ధర్మ రథం) సెప్టెంబర్ 14
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి వేముల శ్రీనివాస్ దంపతులు తొలి పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారికి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా గణనాథుడి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల రామకృష్ణ విద్యార్థి జేఏసీ చైర్మన్ దండుగల శ్రీనివాస్, కొమేర శంకర్, గుంజ రాజు, మన్నె రాజు, దండుగల బాబు వడ్డెర సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి వేముల శ్రీనివాస్ దంపతులు తొలి పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారికి హారతి ఇచ్చారు.
ఈ సందర్భంగా వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా గణనాథుడి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల రామకృష్ణ – విద్యార్థి జేఏసీ చైర్మన్ దండుగల శ్రీనివాస్, కొమేర శంకర్, గుంజ రాజు, మన్నె రాజు, దండుగల బాబు వడ్డెర సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












