రాయికల్, 2026-06-05
మండంోన అపూ గమంో పు అభవృదధ పనుు జగత ఎమమెే డ. సంజ ుమ భూమపూజ చేశు. పఠశో పహీ గోడ, చెన షెడ, ముగుదొడ నమణం, సీసీ ోడడు, అంగనవడ భవన మమమతతు పనుు ఈ నధుు ేటంచు.
రాయికల్ మండలంలోని అల్లిపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.3.50 లక్షలతో ప్రహరీ గోడ, రూ.5 లక్షలతో కిచెన్ షెడ్ నిర్మాణం, రూ.4 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణ పనులకు, గ్రామంలో రూ.6 లక్షలతో సీసీ రోడ్డు, రూ.4 లక్షలతో అంగన్వాడి భవన మరమ్మత్తు పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు.
విద్యార్థులకు అభినందన
అల్లిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి యోగాసన, అథ్లెటిక్స్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచగా, వారిని ఎమ్మెల్యే అభినందించారు.
లయన్స్ క్లబ్‌కు ఫ్రీజర్ అందజేత
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ చేతుల మీదుగా, కిష్టం పేట మాజీ సర్పంచ్ తంగేళ్ళ రమేష్ తన తండ్రి స్మారకార్థం రాయికల్ లయన్స్ క్లబ్‌కు ఫ్రీజర్‌ను అందజేశారు.
అంబేద్కర్ కు నివాళులు
అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపెళ్ళి గంగారెడ్డి, సర్పంచ్ గౌతమి వెంకటేష్, పాక్స్ చైర్మన్ రాజలింగం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి యం.ఏ. ముఖీధ్, జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు సురేందర్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ సాగర్ రావు, గ్రామ, మండల నాయకులు, సర్పంచులు, అధికారులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.











