కోసం (ధర్మ రథం) నవంబర్ 28
రేపు కోదాడలో జరిగే దీక్షా దివస్ ను విజయవంతం చేయాలని మండల బిఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు అనంతుల ఆంజనేయులు కోరారు.
రేపు కోదాడలో జరిగే దీక్షా దివస్ ను విజయవంతం చేయాలని మండల బిఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు అనంతుల ఆంజనేయులు కోరారు. కోదాడ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో దీక్షా దివస్ ఒక అపూర్వ ఘట్టమని అన్నారు. కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించడంతోనే రాష్ట్రమంతా అల్లకల్లోలమై, ఢిల్లీ గడగడలాడి, కేంద్ర హోం మంత్రి చిదంబరం ద్వారా తెలంగాణ ప్రకటన సాధ్యమైందని తెలిపారు. మళ్లీ ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవడంతో రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర కొనసాగడంతో తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని పేర్కొన్నారు. కావున, తెలంగాణ రాష్ట్ర సాధనలో అపూర్వమైన ఘట్టమైన దీక్షా దివస్ ను విజయవంతం చేయడం కోసం మండలంలోని అన్ని గ్రామాల నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు భువనగిరి ఉపేందర్, కాసాని ఉపేందర్, టిఆర్ఎస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, మైనార్టీ సెల్ నాయకులు జలీల్, మండల టిఆర్ఎస్ నాయకులు గోలి వెంకటేశ్వర్లు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


