సంగారెడ్డి, 2026-11-27
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీకి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్, వర్క్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాంట్రాక్ట్ బిల్లు ప్రాసెసింగ్‌కు లంచం
ఏసీబీ విడుదల చేసిన ప్రెస్ నోట్ (నెం. 185) వివరాల ప్రకారం; సదాశివపేట మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్ (పబ్లిక్ హెల్త్)గా పనిచేస్తున్న ఎ. రాజేష్ కుమార్ మరియు అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఎ. శివ రెడ్డి తమ కార్యాలయంలో పట్టుబడ్డారు. 2025 గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఉబా చెరువులో చేపట్టిన పూడికతీత పనులకు సంబంధించి 4.50 లక్షల కాంట్రాక్ట్ బిల్లును ఇప్పటికే మంజూరు చేసి ప్రాసెస్ చేసినందుకు అధికారిక సహకారం అందించినందుకు గాను, రాజేష్ కుమార్ ఫిర్యాదుదారుడి నుంచి 15,000 లంచం డిమాండ్ చేసి తీసుకున్నారు. ఆ మొత్తాన్ని భద్రంగా ఉంచేందుకు వర్క్ ఇన్స్పెక్టర్ శివ రెడ్డికి అందజేశారు.
అధికారుల అరెస్ట్
శివ రెడ్డి వద్ద ఉన్న 15,000 లంచం సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనధికారిక లబ్ధి పొందేందుకు నిజాయితీ లేకుండా, తమ ప్రభుత్వ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ తెలిపింది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.
లంచం అడిగితే 1064కు సమాచారం ఇవ్వండి
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సహకరించాలని ఏసీబీ కోరింది. అలాగే (9440446106), ద్వారా కూడా సంప్రదించవచ్చని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు ముఖ్యమైన బహిరంగ ప్రదేశాలలో ఏసీబీ కోడ్ అందుబాటులో ఉంచామని తెలిపింది. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.


