సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026 టీ20 టోర్నీలో ఆంధ్రప్రదేశ్ జట్టు కేరళపై 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026 టీ20 టోర్నీలో ఆంధ్రప్రదేశ్ జట్టు కేరళపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొహాలీలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆంధ్ర బ్యాటర్లలో షేక్ రషీద్ 39 బంతుల్లో 60 పరుగులు చేయగా, సీరాం వెంకట రాహుల్ 30 బంతుల్లో 64 పరుగులతో రాణించాడు. అశ్విన్ హెబ్బర్ 15 బంతుల్లో 37 పరుగులు చేసి జట్టు స్కోరు పెరగడంలో కీలక పాత్ర పోషించాడు.
226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులకే పరిమితమైంది. కేరళ తరఫున అబ్దుల్ బాసిత్ 35 బంతుల్లో 70 పరుగులతో అజేయంగా నిలిచినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 13 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఆంధ్ర బౌలర్లలో ఎం.డి. నిధీష్ మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆంధ్ర జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.


