హైదరాబాద్, 2024-08-16
తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కీలక దశకు చేరుకుంది. ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఫారాలు సమర్పించి ఓటు హక్కును కాపాడుకోవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం తుది దశకు చేరుకుంది. ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తవడంతో, ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో, జాబితాలో తమ పేరు లేకుంటే ఎలా అన్నదానిపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ముసాయిదా జాబితాలో పేరు లేనంత మాత్రాన ఓటు హక్కును కోల్పోరని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. అభ్యంతరాలు, అప్పీళ్ల ద్వారా ఓటును తిరిగి పొందవచ్చని తెలిపారు. ఎన్నికల అధికారులు జారీ చేసే నోటీసులకు సకాలంలో స్పందించాలని సూచించారు.
జాబితా నుంచి తొలగింపునకు కారణాలు
ఎన్యూమరేషన్ ప్రక్రియలో పాల్గొనని, చిరునామా మార్చుకున్న, మరణించిన, లేదా డూప్లికేట్‌గా గుర్తించిన వారి పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగిస్తారు. ఈ విధంగా తొలగించబడిన పేర్లతో కూడిన ప్రత్యేక జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వెబ్‌సైట్‌తో పాటు, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రదర్శిస్తారు. ఓటర్లు తమ పేరు ముసాయిదా జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
పేరు లేకున్నా ఓటు హక్కుకు మార్గాలు
ఒకవేళ ముసాయిదా జాబితాలో తమ పేరు లేకపోయినా, లేదా తమ వివరాలపై ఏవైనా అభ్యంతరాలున్నా, ఎన్నికల అధికారులు ప్రకటించే క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియలో పాల్గొని, అవసరమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారా ఓటు హక్కును పదిలంగా కాపాడుకోవచ్చని అధికారులు తెలిపారు.
2002 ఎస్ఐఆర్తో సరిపోలని వారికి నోటీసులు
ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత, 2002 ఎస్ఐఆర్తో ప్రస్తుత ఓటరు వివరాలు సరిపోలని ఓటర్లకు ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు), సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్వోలు) నోటీసులు జారీచేస్తారు. పాత ఎస్ఐఆర్ వివరాలతో ప్రస్తుత ఓటరును లింక్ చేయలేని సందర్భాల్లో, గత ఎస్ఐఆర్కు ముందు సంబంధిత ఓటరు ఎక్కడ నివాసం ఉన్నారు, వారి వివరాలు, ఓటరుగా వారి అర్హతకు సంబంధించిన పరిస్థితులపై విచారణ జరుపుతారు. సంబంధిత వ్యక్తి ఓటరుగా ఉండేందుకు అర్హుడని తేలితే ముసాయిదా జాబితాలో చేర్చుతారు.
అప్పీళ్లకు అవకాశం
ఈఆర్వో, ఏఈఆర్వో నిర్ణయంతో సంతృప్తి చెందని వారు ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొదటి అప్పీల్‌ను జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలి. అక్కడ న్యాయం జరగకపోతే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి రెండో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు.
దరఖాస్తుల సమయం












