కాకుండా
వేలంపాటల రాజకీయ సంస్కృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆద్యుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. ఎన్నికల్లో డబ్బుతో కొనుగోలు చేసే నీచమైన రాజకీయ సంస్కృతికి చంద్రబాబు ఆద్యుడిగా మారారని ఆయన ఆరోపించారు.
వేలంపాటల రాజకీయ సంస్కృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆద్యుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా విమర్శించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నుంచి పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వరకు ప్రజాస్వామ్య వ్యవస్థను డబ్బుతో కొనుగోలు చేసే నీచమైన రాజకీయ సంస్కృతికి చంద్రబాబు ఆద్యుడిగా మారారని ఆయన ఆరోపించారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఈవీఎంలైనా, బ్యాలెట్ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా, పరిషత్, మున్సిపల్ ఎన్నికలైనా మనమే కొనుగోలు చేయాలి, మనమే గెలవాలి, మనమే అధికారంలో ఉండాలనే ధోరణితో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై ఆయనకున్న అసలు వైఖరిని బయటపెడుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
చంద్రబాబు ప్రజాస్వామ్యం అంటే ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలవడం. ప్రజలు ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి తమకు నచ్చిన అభ్యర్థిని స్వేచ్ఛగా ఎన్నుకునే అవకాశం కల్పించడం. కానీ మీ పాలనలో ఎన్నికలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ప్రజాస్వామ్య ప్రక్రియగా , డబ్బున్నవారు రాజకీయ పదవులను కొనుగోలు చేసే బహిరంగ మార్కెట్‌గా మారుతున్నాయని ఈశ్వరయ్య విమర్శించారు. గ్రామాల్లో సర్పంచి పదవులను ఏకగ్రీవాల పేరుతో రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల వరకు వేలం వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఇది ఏకగ్రీవం కాదని, ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా ఖూనీ చేయడమేనని స్పష్టం చేశారు. ఈ వేలంపాటల సంస్కృతి గ్రామపంచాయతీలకే పరిమితం మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ స్థాయిలకూ విస్తరిస్తోందని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు కోటి రూపాయల వరకు, మున్సిపల్ వార్డు పదవులకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు, కార్పొరేటర్ పదవులకు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వెచ్చించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి కనీసం రూ.10 కోట్లు, ఎంపీపీ పదవికి రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోందన్నారు. ఇవి కేవలం ఎన్నికల ఖర్చులు కావని, ప్రజాస్వామ్యాన్ని డబ్బుతో కొనుగోలు చేసే రాజకీయ వ్యాపారానికి, ప్రజాప్రతినిధుల పదవులను ఆర్థిక లావాదేవీలుగా మార్చే వికృత ధోరణికి నిదర్శనమని విమర్శించారు.

