తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుమగల్ల రమేష్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకుంటూ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని, ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుమగల్ల రమేష్ మాట్లాడుతూ, సామాన్య కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న రేవంత్ రెడ్డి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమమే లక్ష్యంగా ప్రజా పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రవణ్ రెడ్డి, బీసీ నాయకుడు కరుణాకర్ రెడ్డి, నిర్ధవెల్లి సర్పంచ్ భాస్కర్ గౌడ్, పుటోనిగూడ సర్పంచ్ చెప్లి భాస్కర్ నాయక్, దత్తాయపల్లి భాస్కర్, సంతాపూర్ యాదయ్య, బోదునంపల్లి నగేష్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రంగు శంకర్, డైరెక్టర్లు రావుల పెంటయ్య, రాజేందర్ రెడ్డి, ఏర్పుల లింగం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనాథ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోపని భీమయ్య, భాస్కర్, ఎస్టీ సెల్ నాయకుడు రూప్లా నాయక్, తైద పర్వతాలు, రమణ గౌడ్, కోడూరు రాములు, గ్రామ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, డిప్యూటీ సర్పంచ్ మల్లేష్, రవి నాయక్, రాజు, తుమ్మల గోపాల్, మాజీ ఎంపీటీసీ దీదెల జంగయ్య, ముత్యాలు, దర్శన్, ప్రకాష్, పాండు, కిషన్ నాయక్, రాం రెడ్డి, జంగయ్య, అంజయ్య, కుమార్, బాలాజీ, కిష్టయ్య, రామచంద్రయ్య, నర్సింలు, నరసింహ రెడ్డి, శ్రీకాంత్, సచిన్, రాజేష్, ఆంజనేయులు, శ్రీశైలం తదితరులతో పాటు మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


