వేములనర్వ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కట్టికే మల్లేశ్ తండ్రి కట్టికే రామయ్య మృతి చెందారు. ఈ నేపథ్యంలో షాద్నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆదివారం వేములనర్వలోని మల్లేశ్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రామయ్య మృతి పట్ల ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచిస్తూ, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుమగల్ల రమేష్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ అప్పా, మాజీ అధ్యక్షుడు గూడ విరేష్, మాజీ జెడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి, సీఐటీయూ నాయకుడు రఘు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, పీఏసీఎస్ డైరెక్టర్ రాజేందర్, మనోహర్, రావుల పెంటయ్య, లింగం, సర్పంచులు బోధునంపల్లి నగేష్, పుతోనిగూడ భాస్కర్, కొండారెడ్డిపల్లి పల్లె ఆనంద్, ఆల్వాల్ సురేష్ రెడ్డి, వేములనర్వ సువర్ణ నర్సింహా, దేవునిగుడి తండా సుజాత హనుమంతు, వెంకమ్మగూడ అశోక్, కొత్తూరు ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనాథ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాణి, సీనియర్ నాయకులు తుమ్మల గోపాల్, ప్రకాష్, కోడూరు రాములు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రూప్లా నాయక్, అంజయ్య, కుమార్, రాఘవేందర్, మల్లేష్, దర్శన్, యాదగిరి, కిషన్ తదితర గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


