రాయికల్ మండలం, ధర్మజీపేట గాంధీ తాండాకు చెందిన నూతన లంబాడీ సంఘం పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
గాంధీ తాండా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, తాండాలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సూచించారు.
తాండా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, మాజీ సర్పంచ్ హరీష్, రాయికల్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాజ శేఖర్, మాజీ ఉపసర్పంచ్ వెంకటేష్, తట్లవాయి సర్పంచ్ మల్లేశం, వార్డు మెంబర్ భూక్యా తిరుపతి, అంగోత్ తిరుపతి, బాండ్రా రమేష్ తదితరులు పాల్గొన్నారు.












