హనుమకొండ, 10.08.2026
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో, రాష్ట్ర గౌరవ ఇంచార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల అత్యున్నత స్థాయి సమన్వయ సమావేశం ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ సమావేశంలో నూతన డిసిసి కార్యాలయ నిర్మాణ భూమి కేటాయింపు, ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి.
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో, రాష్ట్ర గౌరవ ఇంచార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల అత్యున్నత స్థాయి సమన్వయ సమావేశం ప్రతిష్టాత్మకంగా జరిగింది. ముందుగా డిసిసి భవన్కు విచ్చేసిన ఇంచార్జ్ మంత్రికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి, మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె.ఆర్.నాగరాజు, హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితెల ప్రణవ్, టీపీసీసి మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ, కిసాన్ కాంగ్రెస్ హనుమకొండ ఛైర్మన్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఛైర్మన్ పింగిలి వెంకట్రామ్ నరసింహ రెడ్డి, మాజీ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, చైర్మన్లు రియాజ్, అజీజ్ ఖాన్, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ శ్రీమతి కూచన రవళి, టీపీసీసీ జనరల్ సెక్రేటరీస్ ఇ.వి శ్రీనివాస్ రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఛైర్మన్, అనుబంధ సంఘాల చైర్మన్లు, నూతనంగా నియమితులైన 13 మండలాల అధ్యక్షులు, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని నూతన 10 డివిజన్ల అధ్యక్షులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విడివిడిగా సమావేశమై ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతంపై విస్తృతంగా చర్చించారు.
హనుమకొండ జిల్లా నూతన డిసిసి కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి కేటాయింపు ప్రతిపాదనను రాబోయే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పెట్టి, దానికి త్వరితగతిన ఆమోదం లభించేలా ఇంచార్జ్ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా నాయకత్వం కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్న తప్పుడు చిరునామాలు, బోగస్ ఓట్లు, నాన్-మ్యాపింగ్ ఓటర్ల తొలగింపు/సవరణలపై కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. దీనికోసం క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి, ముఖ్యంగా ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి బలంగా తీసుకెళ్లే బాధ్యతను నూతన మండల, డివిజన్ అధ్యక్షులకు అప్పగించారు. రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పిలుపునిచ్చారు. డివిజన్ల వారీగా పార్టీ బలాబలాలను సమీక్షించి, గెలుపు వ్యూహాలను సిద్ధం చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
(ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు), స్టేట్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, ఈ ప్రతిపాదనలను కేవలం డిసిసి ద్వారానే రాష్ట్ర కమిటీకి పంపేలా సమన్వయం చేయాలని కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన 13 మండల అధ్యక్షులు, 10 డివిజన్ అధ్యక్షులతో కలిసి రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుండి మరింత బలోపేతం చేయడం కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల చైర్మన్లు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











