హైదరాబాద్, 2026-08-21
జనసేన పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిగా తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్, పార్టీ రాష్ట్ర నాయకులు డా. గడల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు.
జనసేన పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిగా తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్, పార్టీ రాష్ట్ర నాయకులు డా. గడల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.
కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాసరావు
ఈ నియామకంపై డా. గడల శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, ప్రజా సమస్యలపై జనసేన వైఖరిని స్పష్టంగా, హుందాగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.












