నల్లగొండ (ధర్మ రథం) ఆగస్టు 08
మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనియెడల ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 18, 19, 20 తేదీలలో జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహించి, ఆగస్టు 24వ తేదీన డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

విస్తృతస్థాయి సమావేశం
శనివారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవనంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం కందికట్ల వసంత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల ప్రభుత్వం పిచ్చి తల్లి ప్రేమను చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యధికంగా కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని, ప్రభుత్వం ఇచ్చే అతి తక్కువ పారితోషికాలతో కుటుంబాలను పోషించలేక, పాఠశాలలో విద్యార్థులకు అప్పు తెచ్చి వండి పెట్టలేక, అప్పుల బాధతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు.
హామీలను మరిచిన ప్రభుత్వం
అనేకమార్లు ప్రభుత్వాలకు తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు ఇచ్చి, ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదని నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పదివేల రూపాయల వేతనం నిర్ణయించి అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ హామీని మరిచి కార్మికులకు అన్యాయం చేసిందని ఆరోపించారు.
కనీస వేతనం డిమాండ్
కార్మికులకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని ఉన్నప్పటికీ, అప్పటివరకు ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా కనీసం పదివేల వేతనం అయినా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమ్మ ఆదర్శ కమిటీలు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన కార్మికులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ, భయపెడుతున్నారని అన్నారు.
మెనూ చార్జీలు, బిల్లులపై ఒత్తిడి
నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం అతి తక్కువ మెనూ చార్జీలు ఇచ్చి, మెనూ ప్రకారం వండాలని అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చి కార్మికుల నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు సకాలంలో రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే ఏప్రిల్ నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని కోరారు.