జగిత్యాల, 2026-06-05
రాయికల్ మండలం ఉప్పు మడుగు గ్రామంలోని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. మొక్కల ప్రాధాన్యతను తెలియజేస్తూ మదర్ ట్రీని ఏర్పాటు చేయడంతో పాటు, రక్షాబంధన్ సందర్భంగా చెట్లకు రాఖీలు కట్టారు.
రాయికల్ మండలం ఉప్పు మడుగు గ్రామంలోని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో కేజీబీవీ రాయికల్ ఉప్పుమడుగు పాఠశాలలో విద్యార్థులకు మొక్కల ప్రాధాన్యతను తెలియజేస్తూ మదర్ ట్రీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వృక్షబంధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రక్షాబంధన్ పండుగ సందర్భంగా, విద్యార్థులు మొక్కల ఆకులు, పువ్వులను ఉపయోగించి సహజసిద్ధమైన రాఖీలను తయారు చేశారు. అనంతరం వాటిని పాఠశాల ఆవరణలోని చెట్లకు కట్టి, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.శోభారాణి, జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.












