మునగాల, 2024-06-05
మునగాల మండలం కోదండ రామాపురం గ్రామంలో వీధి లైట్లు అమర్చే పనిలో ఉండగా కరెంటు షాక్ తగిలి బుర్రి వీరబాబు అనే ఎలక్ట్రిషన్ మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
మునగాల మండలం కోదండ రామాపురం గ్రామంలో వీధి లైట్లు అమర్చుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి బుర్రి వీరబాబు (తండ్రి: మంగయ్య, వయస్సు: 29, కులం: యాదవ్, వృత్తి: ఎలక్ట్రిషన్, నివాసం: కోదండరామపురం) అనే వ్యక్తి మరణించారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి, మార్చరీ గదిలో భద్రపరిచారు.












