న్యూఢిల్లీ, 2026-06-05
దేశవ్యాప్తంగా కొత్త ఎల్పీజీ (డొమెస్టిక్ గ్యాస్) కనెక్షన్ల జారీలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. మార్చి నుంచి ప్రధాన నగరాల్లో కొత్త కనెక్షన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
దేశవ్యాప్తంగా కొత్త ఎల్పీజీ (డొమెస్టిక్ గ్యాస్) కనెక్షన్ల జారీలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. మార్చి నుంచి ప్రధాన నగరాల్లో కొత్త కనెక్షన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర మెట్రోపాలిటన్ నగరాల్లో కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు బ్రేక్ పడింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కనెక్షన్ల కంటే, ఇప్పటికే ఉన్న వినియోగదారులకు సకాలంలో సిలిండర్ రీఫిల్స్ అందించడానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కొత్త కనెక్షన్ల జారీని యథావిధిగా ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.
ఫెడరేషన్ ఆఫ్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి పవన్ సోని మాట్లాడుతూ, గ్యాస్ సరఫరాకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. త్వరలోనే సమస్య సద్దుమణిగి, కొత్త కనెక్షన్ల జారీ మళ్లీ ప్రారంభమవుతుందని ఆయన ధైర్యం చెప్పారు.
కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మరికొన్ని రోజులు వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.