మండలం భూపతిపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్యలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పీఏసీఎస్ నూతన కార్యవర్గ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కు నూతన కార్యవర్గ సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
పీఏసీఎస్ నూతన కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్యలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
పీఏసీఎస్ నూతన కార్యవర్గ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కు నూతన కార్యవర్గ సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ నూతనంగా నియమితులైన పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
రైతుల సంక్షేమం, సహకార రంగ అభివృద్ధికి నూతన కార్యవర్గం సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రావు, మహేందర్, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మల శేఖర్ రెడ్డి, డైరెక్టర్లు రౌట్ల కిష్టయ్య, అచ్చ గంగు, మంత్రి జలంధర్, అల్లాల లత, కొత్తకొండ శ్రీనివాస్, అనుగంటి రాధా, ముద్దం రమేష్, అనుపురం రాజాగౌడ్, మాలోత్ రాజు నాయక్, ముంజం రాజేందర్, అమిరిశెట్టి, నరేందర్, దంటికా రాజేశం తదితరులు పాల్గొన్నారు.












