నడిగూడెం మండలాన్ని మండలంగా ప్రకటించాలని బిఆర్ఎస్ మండల సమన్వయ కమిటీ సభ్యులు అనంతుల ఆంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. వర్షాలు లేక, కరెంటు కోతలతో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.
నడిగూడెం మండలాన్ని మండలంగా ప్రకటించాలని బిఆర్ఎస్ మండల సమన్వయ కమిటీ సభ్యులు అనంతుల ఆంజనేయులు కోరారు. మండలంలోని సాగర్ కాల్వ కింద గల ఆర్ నైన్ ఎల్ 34, ఎల్ 35, ఎల్36 లిఫ్టుల కింద ఆయకట్టు గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగర్ నీళ్లు రాకపోవడంతో, బోర్ల కింద, బావుల కింద నాట్లు పెట్టినప్పటికీ, వర్షాలు రాక, కరెంటు సక్రమంగా సరఫరా కాక, నాట్లు పెట్టిన పొలాలు ఎండిపోయాయి. నీటి సరఫరా లేని పొలాలను బీడులుగా వదిలేయడంతో రైతులు దిక్కుతోచని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. నాన్ ఆయకట్టు గ్రామాల రైతులు చెరువులు నిండకపోవడంతో బోరుబావుల కింద పొలాలు సాగు చేశారు. అయితే, కరెంటు సక్రమంగా అందక, వేసిన పంట పొలాలు ఎండిపోయాయి. లక్షల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన రైతులు తీవ్ర ఆవేదనతో కొట్టుమిట్టాడుతున్నారు. పత్తి, కంది, పెసర తదితర పంటలు వేసినప్పటికీ, ఎల్ నినో ప్రభావంతో వర్షాలు రాక, ఆయా పంటలన్నీ రైతులకు చేతికి రాక, రైతులంతా తీవ్ర ఆవేదనతో అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా, గ్రామాలలో రైతుకూలీలకు సరిపడా పని దొరక్క అగమ్యగోచరంగా అల్లాడుతున్నారు. కావున, మండలాన్ని మండలంగా ప్రకటించి, మండల ప్రజలను ఆదుకోవాలని అనంతుల ఆంజనేయులు అన్నారు.లేనియెడల, మండలంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నాలు, బంద్ లు, రాస్తారోకోలు నిర్వహించి, ప్రభుత్వం మెడలు వంచైనా సరే మండలంగా ప్రకటించే వరకు పోరాడతామని హెచ్చరించారు.












