బిచ్కుంద, 2026-11-22
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఇందిరమ్మ హయాంలో నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఇందిరమ్మ హయాంలో నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని దుస్థితి నెలకొంది. వర్షాకాలం వస్తే ఇళ్లలోకి నీరు చేరుతోంది. కూలిన గోడల మధ్యే పేదల జీవనం సాగుతోంది. అంబేద్కర్ కాలనీ వృద్ధురాలు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించి ఆదుకోవాలని వేడుకున్నారు. గతంలో భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో నిర్మించిన ఇళ్లు ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని, గోడలు బీటలు వారడంతో పాటు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి నివాసముంటున్న ఈ ఇళ్లలో కనీస వసతులు లేక, వర్షాకాలంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఈ సందర్భంగా బాధిత వృద్ధురాలు మాట్లాడుతూ, రుద్రూర్ మండల కేంద్రంలో పత్తి రామన్న, ఇందూరు చంద్రశేఖర్ తమకు న్యాయం చేయాలని వేడుకుంది. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని, ఆయన అయినా తమ పరిస్థితిని అర్థం చేసుకొని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.
అంబేద్కర్ కాలనీలో ఒక్క ఇల్లే కాదు, చాలామంది ఇళ్లు కూలిపోయాయి. మరికొన్ని కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. వర్షాకాలం వస్తే ఇళ్లలోనే నీటి మడుగులు ఏర్పడుతున్నాయి. వృద్ధాప్యంలో ఈ కష్టాలు భరించలేకపోతున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఇదే పరిస్థితిలో జీవిస్తున్నాం. మాకు న్యాయం చేసి సురక్షితమైన నివాసం కల్పించాలని బాధితులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు అంబేద్కర్ కాలనీని సందర్శించి శిథిలావస్థకు చేరిన ఇళ్లను పరిశీలించాలని, అర్హులైన బాధితులకు నూతన గృహాలు మంజూరు చేసి తక్షణమే న్యాయం చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు పేదల కన్నీళ్లు తుడవాలి. ప్రాణాలకు ముప్పుగా మారిన శిథిల గృహాల సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. కానీ కట్టిన ఇల్లే కూలిపోయే పరిస్థితి వస్తే పేదవాడి పరిస్థితి ఎంత దయనీయమో అర్థం చేసుకొని ప్రభుత్వ అధికారులు పేదవారికి సేవలు అందించాలని ప్రతీ ఒక్కరూ ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా గోడు వెళ్లబోతున్నారు.



