మధిర, 2026-06-05
గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈ నెల 15 లోపు కేవైసీ చేసుకోవాలని మధిర శ్రీ సాయి వెంకటేశ్వర హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ దోసపాటి కళ్యాణి గారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఈ నెల 15 లోపు గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ కేవైసీ చేయించుకోవాలని, లేనిపక్షంలో గ్యాస్ సిలిండర్‌తో పాటు సబ్సిడీ నిలిచిపోతుందని ఆమె హెచ్చరించారు.
గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈ నెల 15 లోపు కేవైసీ చేసుకోవాలని మధిర శ్రీ సాయి వెంకటేశ్వర హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ దోసపాటి కళ్యాణి గారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఈ నెల 15 లోపు గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ కేవైసీ చేయించుకోవాలని, లేనిపక్షంలో గ్యాస్ సిలిండర్‌తో పాటు సబ్సిడీ నిలిచిపోతుందని తెలిపారు.
వినియోగదారుల జాప్యం
గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కేవైసీ చేయాలని సూచిస్తున్నప్పటికీ, వినియోగదారులు జాప్యం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 లోపు కేవైసీ పూర్తి చేసుకోవాలని, సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద గానీ, గ్యాస్ డెలివరీ బాయ్ వద్ద గానీ కేవైసీ చేయించుకోవచ్చని ఆమె తెలిపారు.
ఉజ్వల కనెక్షన్లపై ప్రభావం
ఉజ్వల కనెక్షన్ దారులు కేవైసీ చేసుకోని పక్షంలో రూ. 350 సబ్సిడీ నిలిపివేయబడుతుందని, ఈ నెల 16 నుంచి కేవైసీ చేసుకోని గ్యాస్ వినియోగదారులు కమర్షియల్ ధరలకే సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తుందని, దీనివల్ల రూ. 2500 నుంచి రూ. 3000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు.
ప్రచారం జరుగుతున్నా స్పందన కరువు
అధికారులు, డీలర్లు, సోషల్ మీడియా, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించినప్పటికీ, జిల్లాలో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు కేవైసీ చేసుకోలేదని, దీనివల్ల వినియోగదారులతో పాటు డీలర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు.









