జగిత్యాల, 2026-08-20
సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సెప్టెంబర్ 5న హనుమకొండలో జరిగే తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర మూడవ మహాసభల పోస్టర్ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూరుగుల నాగేందర్ మాదిగ తో కలిసి ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
జర్నలిస్టుల సేవలను కొనియాడిన మంత్రి
సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందని తెలిపారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో టీఎంజెఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మైలారపు ప్రేమ్ కుమార్, బొల్లెపాక రాజేష్, రాష్ట్ర నాయకులు బోట్ల సదానందం, సిరిసిల్ల అనిల్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.










