మధిర, 2026-06-05
మధిర పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొన్నారు. ఆయన దెందుకూరు రోడ్డులోని ఎస్ఆర్ కన్వెన్షన్‌లో జరిగిన ఐలూరి ఉమామహేశ్వర రెడ్డి గారి పిన్ని గారి కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఉద్యోగి రిసెప్షన్‌కు హాజరు
అనంతరం, మధిర మునిసిపాలిటీ ఉద్యోగి చటారి కుమార్ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ శుభకార్యాల్లో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్ వైవి అప్పారావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొగ్గుల భాస్కరరెడ్డి, కటికల సత్యనారాయణ రెడ్డి, వంకాయలపాటి నాగేశ్వరరావు, ఆళ్ళ నాగ్ బాబు, సయ్యద్ ఇక్బాల్, లంకెమళ్ళ నాగేశ్వరరావు, దిల్ కుమార్, చీదిరాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.