రాజన్న సిరిసిల్ల, 2026-08-21
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నా కళాకారుల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదని, వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని తెలంగాణ జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు తీగల ్ నర్సేశం గౌడ్ తీవ్రంగా ఖండించారు. ్ నర్సన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల అధ్యక్షులు సుద్దాల దేవయ్య, రాష్ట్ర నాయకులు మెంగని మనోహర్ తో కలిసి ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నా కళాకారుల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదని, వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని తెలంగాణ జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు తీగల రాజేశం గౌడ్ తీవ్రంగా ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల అధ్యక్షులు సుద్దాల దేవయ్య, రాష్ట్ర నాయకులు మెంగని మనోహర్ తో కలిసి ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వానికి కళాకారుల డిమాండ్లు
పేద, వృద్ధ కళాకారులకు పెన్షన్ సౌకర్యం, ఉచిత బస్ పాసులు, ఉచిత వైద్యం, హెల్త్ కార్డ్ అందించాలని, అలాగే ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం చేసి కళాకారులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాలతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా కళాకారులందరూ ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టడానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
గత ప్రభుత్వంతో పోలిక
గత కేసీఆర్ గారి పాలనలో సుమారుగా కొన్ని వందల మంది పేద కళాకారులకు ఉద్యోగ భద్రత కల్పించడం జరిగిందని, కళాకారుల సంక్షేమం కోసం కొన్ని అవకాశాలు కల్పించినప్పటికీ పూర్తిస్థాయిలో అందరికీ న్యాయం జరగలేదని రాజేశం గౌడ్ తెలిపారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ద్వారా పేద కళాకారులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారం అప్పగించామని, కానీ ప్రస్తుతం వారి తీరు పేద కళాకారుల నడ్డి విరిచే విధంగా ఉందని విమర్శించారు.
కళాకారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి
ఇప్పటికైనా ప్రభుత్వం పేద కళాకారులను ఆదుకోవాలని, వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కళాకారుల పక్షాన తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజేశం గౌడ్, ముస్తాబాద్ మండల అధ్యక్షులు సుద్దాల దేవయ్య, ఇల్లంతకుంట మండల అధ్యక్షులు సుధాగోని రాజమల్లు గౌడ్, బోయినిపల్లి మండల అధ్యక్షులు బండి రవీందర్ పంతులు, ముస్తాబాద్ గౌరవ అధ్యక్షులు బొప్పనారాయణ, ఉపాధ్యక్షులు రేపాక బాల్ నర్సు, గీసా శంకర్, కాసారం నారాయణ, ప్రధాన కార్యదర్శి గున్నాల గణేష్ గౌడ్, సంయుక్త కార్యదర్శి ఎండి సయుద్దిన్, ప్రచార కార్యదర్శి జంగిటి ఎల్లయ్య, కోశాధికారి కనిమేని పెంటా రెడ్డి, కళాకారులు విష్ణు, భూమలింగం, మల్లయ్య, నరసయ్య, అజయ్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.












