మునగాల, 2026-06-05
మండల కేంద్రమైన మునగాలలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను గౌడ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను గౌడ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పాపన్న గౌడ్ చరిత్ర
ఈ సందర్భంగా పెద్దగౌడ్ నారగాని వెంకన్న గౌడ్ మాట్లాడుతూ.. బహుజన చక్రవర్తిగా, తెలంగాణ సాధన వీరయోధుడిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. భారత భూభాగ స్వాభిమానానికి, తెలుగు వీరత్వానికి ఆయన పోరాట స్ఫూర్తి నిదర్శనమని పేర్కొన్నారు.
ఆశయాల స్ఫూర్తి
పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు వెంకయ్య గౌడ్, మామిడి శ్రీను గౌడ్, నారగాని వెంకన్న గౌడ్, పరుశురాములు గౌడ్, గండు అంజయ్య గౌడ్, మండవ శ్రీను, మండవ శ్రీనివాస్ గౌడ్, గుండు నాగేశ్వరరావు గౌడ్, నారగాని గోపి గౌడ్, కుక్కడప్పు లక్ష్మయ్య గౌడ్, అమరగాని శ్రీను గౌడ్, మండవ శేషు గౌడ్, కృష్ణ గౌడ్, బత్తిని సూరి గౌడ్, బత్తిని రామకృష్ణ గౌడ్, నారగాని అశోక్ గౌడ్, బత్తిని నాగరాజు గౌడ్, బత్తిని శీను గౌడ్, కాసాని వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.










