జిల్లా మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ఓ లాడ్జిలో భార్యను బీర్ బాటిల్తో పొడిచి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మృతురాలు కర్ణాటకకు చెందిన మహిళగా గుర్తించారు. నిందితుడైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మదనపల్లెలోని ఓ లాడ్జిలో భార్యను బీర్ బాటిల్తో పొడిచి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలు కర్ణాటక రాష్ట్రం, కోలార్ జిల్లా, ముళబాగల్ వాసిగా గుర్తించారు. ఆమెను భర్త నవీద్ భాష అలియాస్ నవీన్ పాష బీర్ బాటిల్తో పొడిచి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లాడ్జి సిబ్బందిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం.












