ఎలికట్టలోని శ్రీ శ్రీ శ్రీ అంబా భవాని మాత దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక అలంకరణలు చేశారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ అంబా భవాని మాత దేవాలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం ఆనవాయితీగా నిర్వహించే అభిషేకాలు, కుంకుమార్చన, ధూపదీప నైవేద్య కార్యక్రమాల్లో భాగంగా, ఆలయ పూజారులు వేదమంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా షాద్నగర్ మున్సిపల్ పట్టణానికి చెందిన పడబట్ల సత్యనారాయణ దంపతులు, వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, ప్రత్యేక అలంకరణ, నైవేద్య సమర్పణతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చాకలి చంద్రయ్య, ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు పాల్గొన్నారు.
అమ్మవారి దర్శనం కోసం ఎలికట్ట గ్రామంతో పాటు పరిసర ప్రాంత గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడి, అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ప్రతి శుక్రవారం నిర్వహించే అమ్మవారి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అంబా భవాని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ కోరింది.












