మార్కాపురం, జూలై 21
మార్కాపురంలో శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర మంగళవారం సాయంత్రం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. దసరా మండపం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగి, తిరిగి అదే మండపానికి చేరుకుంది.
మార్కాపురంలో శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర మంగళవారం సాయంత్రం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.
దసరా మండపం నుంచి ప్రారంభమైన ఈ రథయాత్ర, బస్టాండ్, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం, మాడవీధుల గుండా వైభవంగా సాగి తిరిగి దసరా మండపానికి చేరుకుని విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీమాన్ సహదేవ సఖదాస భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు.
రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ జగన్నాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరినామ సంకీర్తనలు, భజనలు, గోవింద నామస్మరణలతో పట్టణమంతా భక్తిమయ వాతావరణం నెలకొనగా, కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.








