Nalgonda/Yerrupalem (Nalgonda) (ధర్మ రథం) జూలై 21
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకే విడతలో లబ్ధిదారులకు అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ప్రజా పంపిణీ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
వచ్చే నెల (ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు) నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకే విడతలో అందించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆగస్టు 1 నుంచి మూడు నెలల బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
సాధారణంగా ప్రతి నెల మొదటి 15 రోజులు మాత్రమే డీలర్లు రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంటారు. అయితే, వచ్చే నెలలో ఒకేసారి మూడు నెలల కోటా ఇవ్వనుండటంతో ఆగస్టు నెల (31 రోజులు) రేషన్ దుకాణాలు తెరిచి ఉంచి బియ్యం అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి రేషన్ కార్డుదారుడు మూడు సార్లు వేలిముద్రలు (ఈ-పాస్ ద్వారా) వేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.












