Dr. B.R. Ambedkar Konaseema/Sakhinetipalli (ధర్మ రథం) జూలై 24
నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ, దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మునగాల మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల బంద్ నిర్వహించారు.
నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ సంఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం అణిచివేయడాన్ని నిరసిస్తూ, శుక్రవారం దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో మునగాల మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, ఎన్ఎస్ యుఐ మండల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలల్లో తరగతుల బహిష్కరణ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి కొమరాజు శివశంకర్, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి గడ్డం వినోద్, ఎన్ఎస్ యుఐ మండల అధ్యక్షులు గోగుల లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశ విద్యార్థుల భవిష్యత్తుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆటలాడుతోందని, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
న్యాయం కావాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి యువతరం శాంతియుతంగా ప్రజా పోరాటం చేస్తుంటే, ప్రభుత్వం విచక్షణారహితంగా లాఠీచార్జీ చేసి అక్రమ కేసులు బనాయించడం సరైనది కాదన్నారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే మంత్రివర్గం నుండి తొలగించాలని, అక్రమ లాఠీచార్జి సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిరసనకారులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో నిర్వహించే ఏ పరీక్షల్లోనూ పేపర్ లీకేజీలకు అవకాశం లేకుండా కఠిన నియమ నిబంధనలతో నూతన చట్టాన్ని తీసుకురావాలని, నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ పార్లమెంటు సాక్షిగా దేశ ప్రధాని మోడీ జాతికి క్షమాపణ చెప్పాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు గరిడేపల్లి బుచ్చిబాబు, పవన్, సాయి కృష్ణ, డివైఎఫ్ఐ నాయకులు దేవరం శ్యామ్, వెంకటేష్, గగన్, ఎన్ఎస్ యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.












