జగిత్యాల, 24 July
జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ ఎం.చిరంజీవిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల మెట్పల్లి శాంతినగర్లో జరిగిన సునీత హత్య కేసులో ఎస్ఐ నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఎం.చిరంజీవిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల మెట్పల్లి శాంతినగర్లో హత్యకు గురైన సునీత ఉదంతానికి సంబంధించి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే, సునీతను హత్య చేసిన నిందితుడు వంశీ, నెల రోజుల క్రితం ఆమెపై దాడి చేసి చేయి విరగొట్టిన ఘటనలో బాధితురాలు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే, ఆ సమయంలో నిందితుడిపై కేసు నమోదు చేయకుండా ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలోనే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారన్న కోణంలో ఉన్నతాధికారులు ఈ సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.












