క్యాన్సర్ నిరోధక మందుల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ () ఆదేశాల మేరకు 137 నాన్-షెడ్యూల్డ్ మెడిసిన్లపై ట్రేడ్ మార్జిన్ను గరిష్ఠంగా 30 శాతానికి పరిమితం చేయనున్నారు.
ఈ నిర్ణయం వల్ల క్యాన్సర్ మందుల ధరలు 70 వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 137 రకాల నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందులపై ఈ నియంత్రణ వర్తిస్తుంది. వీటిలో రొమ్ము, ప్రొస్టేట్, పెద్ద పేగు, గర్భాశయ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ల చికిత్సకు ఉపయోగించే మందులు కూడా ఉన్నాయి.
నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ () ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ట్రేడ్ మార్జిన్ను 30 శాతానికి పరిమితం చేయడం ద్వారా మందుల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ ధరల తగ్గింపు క్యాన్సర్ రోగులకు ఆర్థికంగా పెద్ద ఉపశమనాన్ని కలిగించనుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక చికిత్స అవసరమయ్యే క్యాన్సర్ రోగులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.












