Suryapet/Munagala (ధర్మ రథం) జూలై 19
మునగాల మండలంలోని నర్సింహాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కోదాడకు చెందిన శ్రీలేఖ హాస్పిటల్ వారి సౌజన్యంతో, గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ప్రారంభించి, రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కోదాడకు చెందిన శ్రీలేఖ హాస్పిటల్ వారి సౌజన్యంతో, గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ప్రారంభించి, అనంతరం రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు శ్రీలేఖ హాస్పిటల్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇదే తరహాలో ఇతర ప్రైవేటు ఆస్పత్రులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు అవసరమైన పరీక్షలు, మందులు ఉచితంగా అందించి ఆదర్శంగా నిలవాలని కోరారు.
ఈ శిబిరంలో డాక్టర్ మీసా రోహిత్ ఆధ్వర్యంలో దగ్గు, జలుబు, జ్వరం, ఆయాసం, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులకు పరీక్షలు నిర్వహించారు. అలాగే స్త్రీల ప్రత్యేక నిపుణురాలు డాక్టర్ కూరపాటి శ్రీలేఖ ఆధ్వర్యంలో మహిళలకు నెలసరి సమస్యలు, కడుపునొప్పి తదితర ఆరోగ్య సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఈసీజీ సహా వివిధ రకాల పరీక్షలు చేశారు.
సుమారు 200 మందికి పైగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో డాక్టర్ దంపతులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్ మీసా రోహిత్, డాక్టర్ కూరపాటి శ్రీలేఖ, ఉపసర్పంచ్ రెడ్డబోయిన ప్రశాంత్, వార్డు సభ్యులు షేక్ అజీజ్ మియా, పచ్చిపాల అశ్విని, వీరబోయిన నరేష్, గ్రామ పెద్ద రేవూరి బాబు, ఆస్పత్రి సిబ్బంది అశోక్, సలీమా, వెంకటేష్, రాకేష్, సంజు, త్రివేణి, సింధు, భాగ్యమ్మ, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










