Jagtial/Raikal (ధర్మ రథం) సెప్టెంబర్ 08
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫిజియోథెరపీ ప్రాముఖ్యతను, శారీరక ఆరోగ్య పరిరక్షణలో ఫిజియోథెరపిస్టుల పాత్రను వివరించారు. అనంతరం వైద్యులను ఘనంగా సన్మానించారు.
ఫిజియోథెరపిస్టుల సేవలు అభినందనీయం రాయికల్: ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిజియోథెరపీ ప్రాముఖ్యత, శారీరక ఆరోగ్య పరిరక్షణలో ఫిజియోథెరపిస్టుల పాత్రపై అవగాహన కల్పించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ వాసం ప్రసాద్ మాట్లాడుతూ ప్రమాదాలు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, పక్షవాతం తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మందులతో పాటు అవసరమైన సందర్భాల్లో ఫిజియోథెరపీ ద్వారా శారీరక కదలికలను మెరుగుపరచుకోవచ్చని అన్నారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ సేవలందిస్తున్న ఫిజియోథెరపిస్టులను డాక్టర్ లయన్ బెక్కం తిరుపతి డాక్టర్ సురేష్ గౌడ్ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ తరఫున ఘనంగా సన్మానించడం జరిగినది ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో వైద్యులు, ఫిజియోథెరపిస్టులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ట్రెజరర్ సుధవేని మురళి గౌడ్ మ్యకల రమేష్ బత్తిని భూమయ్య దాసరి గంగాధర్ఆడెపు రాంప్రసాద్ సామల సత్యనారాయణ వాసం స్వామిఫిజియోథెరపిస్టులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు












