Jagtial/Jagtial (ధర్మ రథం) నవంబర్ 08
నల్లధనం, నకిలీ నోట్లు, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సరఫరాను అరికట్టడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరారు. అప్పట్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దేశ చరిత్రలో సంచలన నిర్ణయంగా నిలిచిన పెద్ద నోట్ల రద్దుకు నేటితో సరిగ్గా పదేళ్లు పూర్తయ్యాయి. 2016 రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని ప్రకటించారు.
ప్రభుత్వ లక్ష్యాలు
నల్లధనం, నకిలీ నోట్లు, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సరఫరాను అరికట్టడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరారు.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ఆ తర్వాత కొత్త రూ.500, రూ.2000 నోట్లు చలామణిలోకి వచ్చాయి. దేశంలో డిజిటల్ చెల్లింపులు, యూపీఐ వాడకం భారీగా పెరిగింది. ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపింది.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగడం, నల్లధనంపై కొంతమేర నియంత్రణ సాధించడం వంటివి ఈ నిర్ణయం వల్ల కలిగిన సానుకూల పరిణామాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


