విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని నవదుర్గ క్షేత్ర పీఠంలో శ్రీ నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్, మాజీ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతిలక్ష్మణ్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జగిత్యాల పట్టణంలోని నవదుర్గ క్షేత్ర పీఠంలో శ్రీ నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని, దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, దుర్గామాత ఆశీస్సులతో జగిత్యాల జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ప్రార్థించారు.
అదే సమయంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ కూడా నవదుర్గ క్షేత్ర పీఠాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ కుటుంబ సభ్యులు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.










