తెలంగాణ, 26 September
తెలంగాణ రాష్ట్ర పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో మొత్తం 70.07% ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( 2026 ) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ఛైర్పర్సన్ శనివారం విడుదల చేశారు.
జులై 21న వెలువడిన నోటిఫికేషన్, 9 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా మూడు విడతల్లో ఈ ఆన్లైన్ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 24,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 22,477 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 15,749 మంది అర్హత సాధించి, రాష్ట్ర వ్యాప్తంగా 70.07 శాతంతో ఉత్తీర్ణత సాధించారు.
ఈ పరీక్షలో పేపర్-2 (గణితం సైన్స్) విభాగంలో 9,131 మందికి గాను 6,720 మంది (73.60), పేపర్-2 (సోషల్ స్టడీస్) విభాగంలో 8,404 మందికి గాను 5,631 మంది (67.00) అర్హత సాధించారు. అలాగే పేపర్-1కు 4,942 మంది హాజరు కాగా 3,398 మంది (68.76) ఉత్తీర్ణులు అయ్యారు. అభ్యర్థులు తమ ఫలితాలను విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ (://...) తో పాటు సమీపంలోని మీ-సేవ కేంద్రాల ద్వారా మార్కుల వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.







