రాయికల్ మండలం కుర్మపల్లి ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యను సర్పంచ్ మ్యాకల మల్లేశం తన చొరవతో పరిష్కరించారు. పాఠశాల బోర్డులోని సబ్మర్సిబుల్ మోటార్ పనిచేయకపోవడంతో పిల్లలకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన వంటకు, మూత్రశాలలకు రన్నింగ్ వాటర్ అందడం లేదని ప్రధానోపాధ్యాయులు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన సర్పంచ్, బోర్ సబ్మర్సిబుల్ మోటార్‌ను తీయించడానికి ప్రయత్నించారు. అయితే, మోటార్ రాకపోవడంతో బోర్ వెల్స్ మిషన్ తో ప్రెస్సింగ్ చేయించారు. అయినా మోటార్ రాకపోవడంతో, బోర్ ప్రెస్సింగ్ కు, బోర్ పైన కొత్త 1 హెచ్‌పీ మోటార్ బిగించడానికి సుమారు రూ. 20,000 ఖర్చయింది. ఈ మరమ్మత్తుల అనంతరం సర్పంచ్ మ్యాకల మల్లేశం చేతుల మీదుగా కొత్త మోటార్‌ను ప్రారంభించారు. దీంతో పిల్లల దాహార్తి తీరడంతో పాటు, వంటగదికి, మూత్రశాలలకు నీటి సరఫరా పునరుద్ధరించబడింది. పిల్లల దాహార్తిని తీర్చినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎలిగెేటి రాజకిశోర్, సర్పంచ్ మ్యాకల మల్లేశంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మ్యాకల మల్లేశం, గ్రామ ఉప సర్పంచ్ చిరుపుల్ల లత-మల్లేష్, ప్రధానోపాధ్యాయులు ఎలిగెేటి రాజకిశోర్, టీచర్ వోడ్నాల ప్రియాంక, అంగన్ వాడి టీచర్ క్రేజీయన్ లత, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, పిల్లల తల్లులు పుల్ల పద్మ, చెట్టి మమత, దయ్యాల స్వరూప, దయ్యాల జయలక్ష్మి, దయ్యాల మంజుల, పుల్ల మనీషా, పుల్ల మానస, పుల్ల తిరుమల, పుల్ల మంజుల, శెట్టి అనుష్య పాల్గొన్నారు.



