Khammam/Madhira (ధర్మ రథం) నవంబర్ 29
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ధనవంతుడైన డాక్టర్‌నంటూ పరిచయం చేసుకుని ఓ వ్యక్తికి భారీగా టోకరా వేశారు. బాధితుడి పేరుతో రుణం తీసుకుని ఏకంగా రూ.10.05 లక్షలు కాజేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ధనవంతుడైన డాక్టర్‌నంటూ పరిచయం చేసుకుని ఓ వ్యక్తికి భారీగా టోకరా వేశారు.
ప్రధాన నిందితుడు డాక్టర్‌గా నమ్మించి, ఇన్‌స్టాగ్రామ్‌లో బాధితుడితో పరిచయం పెంచుకుని, ఆ తర్వాత అతని వ్యక్తిగత వివరాలు, ఓటీపీలను దుర్వినియోగం చేశాడు. బాధితుడి పేరుతో రుణం తీసుకుని ఏకంగా రూ.10.05 లక్షలు కాజేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన నిందితుడి తల్లి కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి సుమారు 20 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.







