నడిగూడెం, 15 October
సూర్యాపేట జిల్లా మండలం రామాపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుజ్జ రామచంద్రయ్య 105 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన పార్థివ దేహంపై పార్టీ జెండా కప్పి నాయకులు నివాళులు అర్పించారు.
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం, నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుజ్జ రామచంద్రయ్య 105 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన పార్థివ దేహంపై పార్టీ జెండా కప్పి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొక్క బిక్షపతి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, రామాపురం సర్పంచ్, మండల పరిషత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ గుండు శ్రీనివాస్, గోపాలపురం సర్పంచ్ సోమయ్య, పోలంపల్లి వీరయ్య, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.












