చిలమత్తూరు, 29 September
కోదాడ నియోజకవర్గంలోని , మునగాల, నడిగూడెం మండలాలకు చెందిన 115 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి () కింద రూ.48,56,650 ఆర్థిక సహాయం అందజేయబడింది. కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి చేతుల మీదుగా ఈ చెక్కులను పంపిణీ చేశారు.
కోదాడ: కోదాడ నియోజకవర్గంలోని , మునగాల, నడిగూడెం మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి () చెక్కులను కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మూడు మండలాలకు చెందిన 115 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.48,56,650 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అందజేశారు.
మండలం: 41 చెక్కులు రూ.17,06,550 మునగాల మండలం: 34 చెక్కులు రూ.14,20,500 నడిగూడెం మండలం: 40 చెక్కులు రూ.17,29,600 మొత్తంగా 115 చెక్కులు రూ.48,56,650 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.











