జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్‌లో 70వ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జూనియర్ కళాశాలల బాల బాలికలకు అండర్19 క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. కరాటే, బాక్సింగ్, ఫెన్సింగ్ వంటి వివిధ క్రీడాంశాల్లో టోర్నమెంట్కంసెలక్షన్స్ నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్‌లో 70వ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జూనియర్ కళాశాలల బాల బాలికలకు అండర్19 విభాగంలో కరాటే, బాక్సింగ్, ఫెన్సింగ్, థాంగ్టా, ఖురాష్, గట్కా, మల్లఖంబ్, కలరిపయట్టు వంటి క్రీడాంశాల్లో టోర్నమెంట్కంసెలక్షన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డి.ఐ.ఈ.ఓ. రమేష్, ఎస్జీఎఫ్ అండర్19 సెక్రటరీ బన్సీలాల్, నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారితో ముచ్చటించారు. క్రీడాకారుల ప్రతిభ, అనుభవాలు, భవిష్యత్ లక్ష్యాలను తెలుసుకుని, క్రీడల్లో క్రమశిక్షణ, పట్టుదల, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం వారి చేతుల మీదుగా బాల బాలికల క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అమేచూర్ కరాటే జనరల్ సెక్రటరీ ఆరుముళ్ల పవన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాక్సింగ్ సెక్రటరీ సంపత్ కుమార్, థాంగ్టా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు వికాస్ కుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాక్సింగ్ వైస్ ప్రెసిడెంట్ జి. మురళి, సీనియర్ కరాటే ఇన్స్ట్రక్టర్లు చందు, గంగాధర్, ఆకాష్, అలాగే పీడీలు అశోక్, రాజశేఖర్, అనిల్ కుమార్, శ్రీవిద్య, గౌతమ్, నర్మద, ఆశ్రిత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్జీఎఫ్ అండర్19 సెక్రటరీ బన్సీలాల్ మాట్లాడుతూ, వివిధ క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ప్రథమ స్థానంలో నిలిచిన బాల బాలికల క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ క్రీడాకారులు ప్రతిభను చాటి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
క్రీడా పోటీల్లో బాల బాలికలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల విజయవంతమైన నిర్వహణలో అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, ఫిజికల్ డైరెక్టర్లు, నిర్వాహకులు సహకరించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నిర్వాహకులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.












