ముస్తాబాద్, 19 September
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్మన్ తలారి రాణి-నర్సింలు చేతులకు అభివృద్ధి పనులకు 28.50 లక్షల రూపాయల అనుమతి ఇచ్చారు
రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం పోతుగల్ గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ తలారి రాణి-నర్సింలు చేతుల మీదుగా 28.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రాణి-నర్సింలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న గారి నాయకత్వంలో మన రాష్ట్రం, మన జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. మన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ అభివృద్ధికి కోటి రూపాయల నిధులు అవసరమని, వాటికి సంబంధించిన అంచనాలను తయారు చేసి సంబంధిత అధికారులకు పంపగా, వాటిలో 28.50 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. మిగతా నిధులు తీసుకురావడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జెల రాజు, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు భాను, ఆత్మ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి మరియు SI జ్యోతి మేడం మరియు మండల కాంగ్రెస్ నాయకులు గుండెల్లి శ్రీనివాస్, కొండల్ రెడ్డి, దేవిరెడ్డి, బాల్ రెడ్డి, రంజని నరేష్, భాను, పోతుగల్ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ-శ్రీనివాస్, ఉప సర్పంచ్ కోల కృష్ణ, వార్డు సభ్యులు ఆది శేఖర్, కారంగుల వెంకటరావు, నామపురం శ్రీనివాస్, పోతుగల్ గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు మెరుగు కిరణ్ కుమార్, మామిండ్ల ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు ఈరవేని శ్రీనివాస్, కేసుగాని చంద్రమౌళి, భిక్షపతి, జంగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.












