జగిత్యాల, 12 October
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉపాధి నిమిత్తం వెళ్లిన జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ క్షిపణి, డ్రోన్ దాడుల్లో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. నాలుగు నెలల క్రితం ఉపాధి నిమిత్తం ఉక్రెయిన్‌కు వెళ్లిన సుదర్శన్ గౌడ్.. అక్కడ జరిగిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రి అడ్లూరి చొరవ తక్షణ సహాయం
బాధిత కుటుంబం ఎదుర్కొంటున్న దుస్థితిని, సుదర్శన్ గౌడ్ భార్య విజ్ఞప్తిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం, బాధిత కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
సీఎంబఆర్ఎఫ్ () నిధుల విడుదల
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి () ద్వారా అందించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా, సుదర్శన్ గౌడ్ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం బాధితులకు పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.












